Sunday, March 10, 2019

Chicken Fry Recipe ( చికెన్ ఫ్రై )


చికెన్ ఫ్రై :

కావలిసిన పదార్థాలు :

చికెన్ : 1 kg
సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు : 1 కప్
పచ్చిమిరపకాయలు : 10
వెలుల్లి రెబ్బలు : 25 gm
అల్లం : 50  gm
గసగసాలు : 25  gm
లవంగాలు : 10
ఉప్పు: రుచికి సరిపడా
కారం : రుచికి సరిపడా
పసుపు : 1 టేబుల్ స్పూన్
గరం మసాలా : 1 స్పూన్
కొత్తిమీర
పొదిన
నూనె : డి ఫ్రై కి సరిపడా

తయారుచేసే విధానం :




గరంమసాలా తయారు విధానం :

ఒక పాన్ లో ధనియాలు-10 gm  , లవంగాలు-10 gm,చెక్క-10 gm వేసి ఫ్రై చేసుకోవాలి , కొన్ని వెలుల్లి రెబ్బలు కూడా వేసుకొని పొడి ల గ్రైండ్ చేసి పెట్టుకోవాలి .
తయారుచేసే విధానం :
ముందుగా ఒక పాన్ లో చికెన్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు , పసుపు వేసి వీడియో లో చూపించిన విధంగా మగ్గించుకోవాలి
తరువాత ఒక మిక్సర్ జార్ లో అల్లం ముక్కలు , వెలుల్లి రెబ్బలు
గసగసాలు , లవంగాలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డి ఫ్రై కి సరిపడా నూనె వేసుకొని చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి .
తరువాత వేరే పాన్ లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయముక్కలు , పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు , పసుపు  కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక , ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా అందులో వేసుకుని
ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలనుకూడా వేసుకొని , సరిపడా కారం వేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి.
చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర , పొందిన మరియు గరం మసాలా  కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి . అంతే ఎంతో రుచికరమైన చిక్కె ఫ్రై తయ్యార్ . మీరుకూడా తప్పకుండ ట్రై చేయండి.



Chicken Fry:

Required Ingredients:

Chicken: 1 Kg
Chopped Onions: 1 Kg
Green Chillies: 10
Garlic: 25 gm
Ginger:50 gm
Khas Khas: 25gm
Cloves: 10
Salt: as required for taste
Red Chillies Powder: as required for taste
Turmeric: 1 tablespoon
Masala Powder: 1 table spoon
Mint leaves
Coriander leaves
Oil


                                        
non-veg recipes

Procedure:

·         Take one kg fresh chicken in a pan add a pinch of salt and turmeric and cook it for sometime as shown in the video until the water content in chicken gets absorbed
·         Now take a mixer jar with ginger, garlic, khan khan, cloves in it and grind into a paste by adding small quantity of water in it
·         Take put a pan on the stove and pour required amount of oil for defray and fry the chicken pieces
·         Now put another pan on the stove and add pour 2 to 3 spoons of oil and add onions and green chillies ,required amount of salt and a pinch of turmeric and fry them
·         After add the masala paste in it and fry them well
·         Now add the chicken pieces and mix them well and add required amount of the red chillies powder
·         Fry them and at last add mint leaves, coriander leaves and 1 table spoon of masala powder and fry it for 5 min
·         Chicken fry is ready to serve now


Sunday, February 24, 2019

Palakova(Andhra Special)- Sitamma Vantalu


పాలకోవా :

కావలిసిన పదార్థాలు :

పాలు : 1 lit
పంచదార : 250 gm
నేయి : 50 gm
బాదాం పప్పు
                               
తయారుచేయువిధానం :

ముందుగా ఒక పాన్ పెట్టి అందులో ఒక లీటర్ పాలు పోయాలి . పాలను బాగా మరిగించుకోవాలి . స్టవ్ ని లౌ ఫ్లేమ్ లో నే ఉంచుకోవాలి. ఇలా పాలు అర లీటర్ వరకు మరిగాక పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంత దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. చివరగా కొద్దిగా నేయి వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పడు ఒక ప్లేట్ కి కొద్దిగా నేయి రాసి అందులో ఆ మిశ్రమం వేసుకొని తగిన షేప్ లో కట్ చేసుకొని బాదం పప్పు తో గార్నిషింగ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన పాలకోవా తయ్యార్..



Milk Sweet:

Required Ingredients:

Milk: 1 Litre
Sugar: 250gm
Ghee: 50gm
Badam: for garnishing

Preparation Process:


                                       
milk sweet recipe

·         Put a pan on the stove and pour the milk and boil until it becomes half of it
·         Now add sugar in it and mix well as shown in the video
·         Keep the stove in low flame
·         When the mixture became thick add a ghee and mix well properly
·         Apply ghee on a plate and take the sweet in it
·         Cut into your required shape and use badam for garnishing
·         Milk sweet is ready to serve now


Sunday, February 3, 2019

How to Make Sorakaya Masala Curry(సొరకాయ బెజ్జం మసాలా )


సొరకాయ బెజ్జం మసాలా కూర :

కావలిసిన పదార్థాలు

సొరకాయ చిన్నది : 1
ఉల్లిపాయ ముక్కలు : 1 కప్
అల్లం : చిన్న ముక్క
వెలుల్లి రెబ్బలు : 5
పచ్చి మిరపకాలు : 2
కొత్తిమీర : కొద్దిగా
పసుపు : 1 / 2 టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
కారం : 1  స్పూన్
కరివేపాకు రెమ్మలు
పోపు దినుసులు
మసాలా పొడి : 1 టేబుల్ స్పూన్
నూనె : 1 గరిట
                         

మసాలా  పొడి  తయారు విధానం :

స్టవ్ మీద పాన్ పెట్టి లవంగాలు , ధనియాలు ,  చక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరగా వెలుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.

తయారుచేయు విధానం :

ముందుగా లేత సొరకాయను తీసుకొని దానికి వీడియో లో చూపించిన విధంగా బెజ్జాలు వేసుకొని దానికి కళ్ళు ఉప్పు పట్టించి ఒక ౩౦ నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఆ సొరకాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి . అల్లం వెలుల్లి ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి . నూనె వేడి అయ్యాక పోపు దినుసులు , పచ్చిమిరపకాయలు , ఉల్లిపాయముక్కలు, పసుపు , కరివేపాకు రెమ్మలు , కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి .
ఉల్లిపాయముక్కలు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి . పాన్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సొరకాయ లో నీరు లేక పోతే కొద్దిగా వేసుకోవాలి . చివరగా కొత్తిమీర , పొడి మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చెయాలి . అంతే ఎంతో రుచికరమైన సొరకాయ బెజ్జం మసాలా కూర తయ్యార్
Bottle Gourd Masala Curry:


Required Ingredients:

Bottle gourd: 1
Chopped Onions: 1 cup
Ginger: 1 small piece
Garlic: 5 petals
Green chillies: 2
Coriander leaves
Turmeric: ½ table spoon
Salt: required for taste
Red Chillies Powder: 1 spoon
Curry leaves
Pope Ingredients
Masala Powder: 1 table spoon
Oil : 2 to 3 spoons

Masala Preparation:

Put a pan on the stove add cloves, coriander seeds, Cinnamon in small amount and fry them well. Then grind them by adding garlic petals and make into a powder.


                                  
sorakaya bejjam masala curry

Curry Preparation:

Select a fresh and round bottle gourd and make the holes to it as shown in the video, Apply rock salt to it as shown in the video and keep it a side for 30 minutes.
Now peel off the bottle gourd and cut into pieces. Take a mixer jar and grind the ginger and garlic into a paste.
Put a pan on the stove pour 2 or 3 spoons oil and heat oil and add pope ingredients, chopped onions and green chillies , turmeric and curry leaves and add a required amount of salt and fry them well.
Now add the bottle gourd pieces and add red chillies powder and cook them well by placing the lid over the pan. If required add a small quantity of water. At last add the coriander leaves and a table spoon of masala powder. Bottle gourd masala curry is ready to serve now.


Sunday, January 27, 2019

How to Cook Karappusa,sev recipe (కారప్పూస )


కారపూస

కావలిసిన పదార్థాలు :

బియ్యం పిండి : 1 కప్
సెనగ పిండి : 1 కప్
వెన్న : 50  gm
వాము : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
కారం : రుచికి సరిపడా
నూనె : డీ ఫ్రై కి సరిపడా
                               
తయారుచేయు విధానం :

ముందుగా ఒక గిన్నె  లో బియ్యం పిండి , సెనగ పిండి , వాము , రుచికి సరిపడా ఉప్పు , కారం వేసి కొద్దిగా వెన్న కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమం లో సరిపడా నీరు కూడా పోసి వీడియో లో చూపించిన విధంగ కలుపుకోవాలి. ఆ ముద్దను చక్రాల గీదలో పెట్టుకోవాలి.
ఇప్పడు స్టవ్ మీద పాన్ పెట్టి డి ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక చక్రాలను వీడియో లో చూపించిన విధం ల నూనె లో వత్తుకోవాలి. కారపూసను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే పిల్లలు , పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కార పూస తయ్యార్ 



Sev/Omapudi Recipe:

Required Ingredients:

sanna karapusa recipe
Rice Flour: 1 cup
Chanadal Flour: 1 cup
Ajwain: 1 table spoon
Fresh cream: 50gm
Salt: required for taste
Red chillies powder: required for taste
Oil: for defray

Preparation process:

·         Take a bowl and add the rice flour, chanadal flour, fresh cream, ajwain, required amount of salt and red chillies powder and them well
·         Now add required amount of water in the mixture and make into a dove
·         Put a pan on the stove and pour oil for defray
·         Heat the oil
·         Put the dove in the Sev making machine
·         Press the dove in the oil after it gets heated
·         Fry them in the oil until Sev turns into golden brown colour
·          Sev/Omapudi Recipe is ready is serve now

Sunday, January 20, 2019

How to Prepare Kanda Pulusu in telugu


కంద పులుసు :

కావలిసిన పదార్థాలు :




                          


కంద ముక్కలు : 1 కప్ ( 1 / 2 kg )
ఉల్లి పాయలు : 1 చిన్న కప్
పచ్చి మిర్చి : 1 టేబుల్ స్పూన్
చింతపండు : 1 స్పూన్
బెల్లం : 1 స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
కారం : 1 స్పూన్
పసుపు : చిటెకెడు
కరివేపాకు రెమ్మలు
పోపు దినుసులు
నూనె : 2  టేబుల్ స్పూన్
తయారు చేయువిధానం :
ముందుగా కంద ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని నీరు పోసి ఒక 15 min ఉడికించుకోవాలి చివరగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి , ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, పసుపు , కరివేపాకు  వేసి ఫ్రై చేసుకోవాలి.
తరువాత ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు , చింతపండు , బెల్లం , కారం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నీరు పోసి ఉడకపెట్టు కోవాలి. అంతే ఎంతో రుచికరమైన కంద పులుసు తయ్యార్

Suran/Yam Gravy Curry:

Required Ingredients:

Suran/Yam: 1 cup (1/2 kg)
Onions: 1 cup
Green Chillies: 1 table spoon
Tamarind paste: 1 spoon
Jaggery : 1 spoon
Salt: required for taste
Red Chillies powder: 1 spoon
Turmeric: a pinch
Curry leaves
Pope Ingredients
Oil: 2 table spoons


suran/elephant leg yam gravy curry




Preparation Process:

·         Take a pan with Suran/Yam pour some water and boil for 15 min and add a pinch of salt at last
·         Now put another pan on stove add 2 table spoons of oil and heat it
·         Now add pope ingredients, chopped green chillies, onions in it
·         Now add a pinch of turmeric, salt and curry leaves and fry them for some time
·         Add boiled Yam and tamarind, jaggery, red chillies powder and mix them well
·         Pour required amount of water and cook well
·         Suran/ Yam curry is ready to serve now...


Sunday, January 13, 2019

How to prepare Sweet Gavvalu(బెల్లపు గవ్వలు )


బెల్లపు గవ్వలు :

కావలిసిన పదార్థాలు :

గోధుమపిండి : 1 కప్
మైదా పిండి : 1 కప్
బొంబాయి రవ్వ : 2 స్పూన్
బెల్లం : 1 కప్
వెన్న : 50 gm
యాలుకల పొడి : 1 టేబుల్ స్పూన్
నూనె : డి ఫ్రై కి సరిపడా

                             


తయారుచేయువిధానం :

ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి,మైదా పిండి,బొంబాయి రవ్వ,బొంబాయి రవ్వ,వెన్న వేసుకొని కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలా. ఆ పిండి ఒక 15 min ఆలా ఉంచాలి .
ఇప్పుడు ఆ పిండి ని చిన్నా చిన్న ఉండలుగా చేసుకొని వీడియో లో చూపించిన విధంగా గవ్వల చక్క మీద గవ్వలను చేసుకోవాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి డి ఫ్రై కి సరిపడా నూనె వేసి మీడియం ఫలమే లో గవ్వలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి;
ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం కొద్దిగా నీరు వేసుకొని ఉడక పెట్టుకోవాలి. బెల్లం వీడియో లో చూపించిన విధం గ పాకం పట్టుకోవాలి
చివరగా గవ్వలో కొద్దిగా యాలుకల పొడి వేసుకొని బెల్లం పాకం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన బెల్లం గవ్వలు తయ్యార్ .....

Bellapu Gavvalu:

Andhra special sweet Bellapu Gavvalu


Required Ingredients:

Wheat flour: 1cup
Maida flour: 1 cup
Jaggaery: 1 cup
Sooji: 2 spoons
Elachi Powder: 1 table spoon
Ghee/Cream: 50gm
Oil: for defray

Preparation Process:

·         Take a bowl with 1 cup of Wheat flour, 1 cup of Maida flour, 2 spoons Sooji, 50 gm Ghee/Cream
·         Add required amount of water and mix like a dove as shown in the video
·         Leave it aside for 15min
·         Prepare the Gavvalu as shown in the video
·         Now put a pan in the stove and add Oil for defray and defray them until it turns into golden brown colour
·         Now prepare the Jaggery Syrup, take 1 cup of jaggery in a bowl and add some amount of water and boil it as shown in the video
·         Now sprinkle the Elachi powder on the prepared gavvalu and also mix the jaggery syrup and mix well properly
·         Bellapu Gavvalu is ready to serve now....



Sunday, January 6, 2019

How to prepare Crispy Potato Balls Chinese recipe(క్రిస్ప్యి పొటాటో బాల్స్


క్రిస్ప్యి పొటాటో బాల్స్

కావలిసిన పదార్థాలు:

ఉడికించిన బంగాళాదుంపలు : 1 కప్
బియ్యం పిండి : 1 / 4 కప్
మిరియాల పొడి : 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి : 1  టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడా
పచ్చిమిరపకాయలు : 2
మొక్కజొన్న పిండి : 1 స్పూన్
నూనె : డి ఫ్రై కి సరిపడా


                     

తయారుచేయువిధానం:

ముందుగా బంగాళదుంపలను ఉడకపెట్టుకోవాలి .ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించుకున్న బంగాళాదుంపలు , ఉప్పు , మిరియాల పొడి ,బియ్యం పిండి ,మొక్కజొన్న పిండి వేసుకొని మెత్తని ముద్దలా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డి ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి , చేతులకు కొద్దిగా నూనె రాసుకొని ఈ ముద్దను చిన్న చిన్న బాల్స్ ల చేసుకొని డి ఫ్రై చేసుకోవాలి . స్టవ్ ని మనం లో ఫ్లేమ్  లో ఉంచి   గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చా వరకు వేయించుకోవాలి . ఏవి ఒక ప్లేట్ లో కి తీసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, సన్నగా తరిగిన పచ్చి మిర్చి చల్లుకోవాలి ఈ బాల్స్ టమాటా సాస్ లో చాల బాగుంటుంది . మీరుకూడా తప్పకుండ ట్రై చేయండి.

Crispy Potato Balls:


Required ingredients:

Boiled potato’s : 1 cup
Rice flour: ¼ cup
Corn flour: 1 spoon
Pepper Powder: 1 table spoon
Cumin (jeera) Powder- 1 table spoon
Salt: required for taste
Oil: for defray

                   
crispy potato/aloo balls


Preparation Process:

·         Boiled the potato’s and peel off them
·         Take a bowl and take boiled potato’s in it and smash them
·         Now add required salt, rice flour, corn flour, pepper powder in it
·         Mix well in to a proper dove
·         Apply oil to hands and make the dove into small balls as shown in the video
·         Put a pan in the stove with oil in it for defray
·         Defray the balls by keeping the stove in low flame until it appears golden brown color
·         Take them in a plate and sprinkle cumin powder, finely chopped chillies and dip into tomato souse/ ketchup and eat
Very simple and tasty snack item try you also...